Share News

‘ప్రసాద్‌’ నిధుల ఊసే ఎత్తని మోదీ

ABN , Publish Date - May 09 , 2024 | 01:16 AM

దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రసాద్‌ పథకం కింద ప్రధాని మోదీ నిధులు ప్రకటిస్తారని అనుకున్నామని, రాజన్న ఆలయ అభివృద్ధిపై ఊసేత్త లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

‘ప్రసాద్‌’ నిధుల ఊసే ఎత్తని మోదీ
మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

వేములవాడ టౌన్‌/ చందుర్తి మే 8 : దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రసాద్‌ పథకం కింద ప్రధాని మోదీ నిధులు ప్రకటిస్తారని అనుకున్నామని, రాజన్న ఆలయ అభివృద్ధిపై ఊసేత్త లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. బీజేపీ నాయకులు దక్షిణ కాశీ అభివృద్ధిపై మాట్లాడతారే కానీ ఎలాంటి నిధులూ మంజూరు చేయలేదన్నారు. పదేళ్లలో అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గెలిపించాలన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వెలిచాల రాజేందర్‌ రావు గెలిస్తే రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారన్నారు. ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

ఫ కరీంనగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ఓటమి పాలవుతున్నాడని తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ హుటాహుటిన వేములవాడకు వచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో బుధవారం మాట్లాడారు. దక్షిణకాశీకి వచ్చిన మోదీ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఎందుకు మాట్లాడలేదన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న ఆలయం గురించి ప్రధాన మంత్రి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.

ఫ బతికున్నంత కాలం అవినీతికి పాల్పడనని ప్రామణం చేస్తున్నానని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. వేములవాడ రోడ్‌షోకు వచ్చిన ఆయన మాట్లాడారు. తన తండ్రి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పని చేశారని, తాను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, సింగిల్‌ విండో చైర్మన్‌గా పదవులు చేపట్టానని, తమ కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవన్నారు.

ఫ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలి

కోనరావుపేట : రైతు వ్యతిరేక బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలని, పేదల పార్టీ కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మంగళపల్ల్లి ఆర్య క్షత్రియ సంఘం నాయకులు, పల్లిమక్తకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు

రుద్రంగి: బీజేపీ మళ్లీ ఆధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల్‌ను రద్దు చేస్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో పేదలు మరింత పేదలుగా మారారని, బండి సంజయ్‌ మన ప్రాంతానికి చేసిందేమీ లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీ బిడ్డను గెలిపించారని, మీ బిడ్డకు తోడుగా ఎంపీగా వెలిచాల రాజేందర్‌రావును హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు.

ప్రజలకు సేవ చేసేందుకే..

ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికల్లో నిలబడినట్లు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. కరీంనగర్‌ పరిధిలో ఎంపీల్యాడ్స్‌ కింద రూ.25 కోట్లు మంజూరవగా 5 కోట్లు మాత్రమే అభివృద్ధి పనులకు ఖర్చు చేశారన్నారు. మిగతా రూ.20 కోట్లు ఖర్చు చేయడం చేతకాక మురిగిపోయా యన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తోందన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ మీనయ్య, కాంగ్రెస్‌ మండల ఆధ్యక్షుడు జలపతి పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:16 AM