రామగుండంలో పర్యటించిన ఎన్టీపీసీ ఆర్‌ఈడీ
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:27 AM
ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆర్‌ఈడీ, దక్షిణ) ప్రేం ప్రకాష్ రామగుండం ఎన్టీపీసీ లో పర్యటించారు.
జ్యోతినగర్, అక్టోబరు 11: ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆర్‌ఈడీ, దక్షిణ) ప్రేం ప్రకాష్ రామగుండం ఎన్టీపీసీ లో పర్యటించారు. దుర్గా నవ రాత్రోత్సవాల సందర్భంగా గురువారం ఎన్టీపీసీకి వచ్చిన ఆర్‌ఈడీ రెండు రోజులపాటు ఎన్టీపీసీలో పర్యటించారు. గురువారం రాత్రి దుర్గామాత మంటపంలో పూజలు చేశా రు. శుక్రవారం ఆర్‌ఈడీ ప్రేం ప్రకాష్ రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టిఎస్‌టిపిపి)లో వివిధ విభాగాలను పరిశీ లించారు. అనంంతరం సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సంబంధించి నిర్మించిన బి టైపు క్వార్టర్లను ఆర్‌ఈ డీ ప్రారంభించారు. ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటో రియంలో ఉద్యోగులు, అధికారులతో ఆర్‌ఈడీ సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఈడీ ప్రసంగిస్తూ రామగుండం ఎన్టీపీసీ ఉదోగుల కృషి ఫలితంగానే నాలుగు దశాబ్దాలుగా సమర్థవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదన్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 40సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద ర్భంగా ఆయన సిబ్బందకి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. ఆర్‌ఈడీ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి గా ఆర్‌ఈడీ ప్రేంప్రకాష్, మీనుబాత్రా దంపతులను రామ గుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు, చిన్మయిదాస్ లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ రీజియన్ హెచ్‌ఆర్ ముఖ్య అధికారి ఎస్.ఎన్.పాణిగ్రహి, రామగుండం, టీఎస్‌టీపీపీ ఈడీ కేదార్ రంజన్ పాండు, దక్షిణ దీపాంజలి మహిళా సంఘం అధ్యక్షురాలు మీనుబాత్రా, ప్రాజెక్టు జీఎంలు, ఇతర అధికా రులు, ఉద్యోగులు పాల్గొన్నారు.