Share News

ఎన్టీపీసీలో రీజియన్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:11 AM

రామగుండం ఎన్టీపీసీలో కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్‌ రీజియన్‌ స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌(బ్యాడ్మింటన్‌) గురువారం ప్రారంభ మైంది.

ఎన్టీపీసీలో రీజియన్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

జ్యోతినగర్‌, జూలై 25 : రామగుండం ఎన్టీపీసీలో కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్‌ రీజియన్‌ స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌(బ్యాడ్మింటన్‌) గురువారం ప్రారంభ మైంది. కేంద్రీయ విద్యాలయ సంఘ టన్‌(హైదరాబాద్‌) ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జ్యోతిక(రిక్రియేషన్‌ క్లబ్‌) ఇండోర్‌ స్టేడి యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మంటన్‌ పోటీ లను ఎన్టీపీసీ ఈడీ కేదార్‌ రంజన్‌ పాండు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడీ కేదార్‌ రంజన్‌ మాట్లాడుతూ క్రీడల వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని పేర్కొన్నా రు. శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ధారుడ్యం పెంపొందుతుందన్నారు. ఆట లలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని, ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఈ పోటీలలో హైదరాబాద్‌ రీజియన్‌లోని వివిధ కేంద్రీయ విద్యాలయాలకు చెందిన 39 మంది బాల బాలికలు పాల్గొంటున్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రీజినల్‌ పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రారంభ కార్య క్రమంలో కేవీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం స్పోర్ట్స్‌ మీట్‌ ముగియనున్నది. ఈ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శోభన్‌ బాబు, పీడీ పూజా బిజిరానియా, కోచ్‌ క్రిష్ణయ్య, పలువురు విద్యార్థులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:11 AM