Share News

ప్రజల తోడ్పాటు లభించినప్పుడే ఫలితాలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:52 AM

స్వచ్ఛత హీ సేవా వంటి కార్యక్రమాల్లో ప్రజల నుంచి పూర్తి స్థాయి లో తోడ్పాటు లభించనప్పుడే ఆశించిన ఫలితాలు వస్తా యని మున్సిపల్‌ కమిషనర్‌ మీర్జా ఫసహత్‌ ఆలీ బేగ్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవలో భాగంగా స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్‌ వరకు స్వచ్ఛత హీ సేవపై నిర్వహించిన అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ప్రజల తోడ్పాటు లభించినప్పుడే ఫలితాలు
సిరిసిల్లలో స్వచ్ఛత ర్యాలీలో మున్సిపల్‌ కమినర్‌, కౌన్సిలర్లు

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 1: స్వచ్ఛత హీ సేవా వంటి కార్యక్రమాల్లో ప్రజల నుంచి పూర్తి స్థాయి లో తోడ్పాటు లభించనప్పుడే ఆశించిన ఫలితాలు వస్తా యని మున్సిపల్‌ కమిషనర్‌ మీర్జా ఫసహత్‌ ఆలీ బేగ్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవలో భాగంగా స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్‌ వరకు స్వచ్ఛత హీ సేవపై నిర్వహించిన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పట్టణంలోని గృహాల మధ్య రోడ్లపైన చెత్త వేయొద్దని, తడిపొడి చెత్తతో పాటు హానికరమైన వ్యర్థ పదార్థాలను వేరు చేసి మున్సిపల్‌ వాహ నాలకు అందించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. అంతకుముదు బతుకమ్మ ఘాట్‌లో శ్రమదానంలో భాగంగా చెత్తచెదారం తొలగించి మున్సిపల్‌ కౌన్సి లర్లు, సిబ్బంది, రిసోర్స్‌ పర్సన్స్‌ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:53 AM