Share News

నదీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:49 AM

వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు, నది పరిహవాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్ట ర్‌ సత్యప్రసాద్‌ సూచించారు.

నదీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎర్దండి గోదావరి నదిని పరిశీలించిన కలెక్టర్‌

ఇబ్రహీంపట్నం, జూలై 26: వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు, నది పరిహవాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్ట ర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని ఎర్దండి గోదా వరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నాలు గు రోజులు వర్షలు ఉన్న నేపథ్యంలో వాగులు పొంగిపొర్లి చెరువులు నిండు కుం డలుగా ఉన్నాయని, ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్దకు పిల్లలు, యువ కు లు ఎవరు వెళ్లవద్దని సూచించారు. వాగుల వద్ద, నదుల వద్ద హెచ్చరిక బో ర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మట్టి ఇళ్లలో నివసించే వారు అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం డయల్‌ 100 సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్‌లు, అధికారులు, సిబ్బం ది అప్రమత్తంగా ఉంటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండ చర్యలు చేపట్టాలని అదేశించారు. ఆనంతరం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో డ్రైనిజీని పరిశీలిం చారు. ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేయాలని, డ్రైనిజీలను శుభ్రం చేయాలని సం బంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవవో శేఖర్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను క లెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో వంట శాలను, స్టోర్‌ను పరిశీలించారు. ఆనంతరం విద్యార్థులను అకాడమీ ఇయర్‌ సె లబస్‌ గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు రాయడం చవడం గణితం ఇంగ్లీష్‌, హింది, సిలబస్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అదేశించారు. ఉపాధ్యా యులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులపై శ్రద్ద చూపించి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేల చర్యలు చే పట్టాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:49 AM