Share News

కోల్‌బెల్ట్‌ కేంద్రంగా రూ.10 కోట్ల సైబర్‌ మోసం

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:13 AM

ప్రజల బలహీనతలను ఆస రాగా చేసుకుని సైబర్‌ నేరస్థులు తప్పుడు యాప్‌ లను తయారు చేసి కోట్లు దండుకున్నారు.

కోల్‌బెల్ట్‌ కేంద్రంగా రూ.10 కోట్ల సైబర్‌ మోసం

కోల్‌సిటీ, జూలై 25: ప్రజల బలహీనతలను ఆస రాగా చేసుకుని సైబర్‌ నేరస్థులు తప్పుడు యాప్‌ లను తయారు చేసి కోట్లు దండుకున్నారు. ముఖ్యం గా కోల్‌బెల్ట్‌ కేంద్రంగా మధ్య తరగతి ప్రజల బలహీ నతలను ఆసరగా చేసుకుని చైన్‌లింక్‌ మార్కెటింగ్‌ పేర సామాన్యులకు వలవేశారు. రూ.10వేలు పెడితే రోజుకు 500వస్తాయంటూ నమ్మబలికి వేల మందిని ఉచ్చులోకి దించారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి కరీంనగర్‌ వరకు వేల మందిని ఈ వ్యాపా రంలోకి లాగారు. కనీసంగా రూ.10వేల నుంచి గరి ష్టంగా రూ. 6లక్షల వరకు పెట్టుబడి పెట్టించి తర్వా త యాప్‌లను క్లోజ్‌ చేశారు. నిండా మునిగామను కున్న బాధితులు గురువారం రామగుండం సీపీ శ్రీని వాస్‌ను ఆశ్రయించారు. సీపీ ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. జాతీయ పోర్టల్‌ 1930లో ఫిర్యా దులు చేయడంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సైబ ర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో విచారణ ప్రారంభించారు. ఘటన కు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు.. సైబర్‌ నేరస్థులు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టు కున్నారు. తాము ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను ఉప యోగించి షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తామని, రోజుకు రూ.1000కి రూ.500 లాభం వస్తుందంటూ నమ్మించారు. ఆన్‌లైన్‌లో డాటా అమీర్‌, ఆర్టిఫిషియ ల్‌ ఇంటలిజెన్స్‌, బ్లూచిప్‌ ట్రేడింగ్‌ తదితర సంస్థల పేర యాప్‌లు క్రియేట్‌ చేసి తాము పెట్రోలియం, బంగారం, ఆయిల్‌ రంగాల్లో పెట్టుబడులు పెడుతు న్నామని, ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌ ప్రభావంతో భారీగా లాభాలు వస్తున్నాయంటూ నమ్మించారు. మంచిర్యాలకు చెందిన చంద్రశేఖర్‌ అనే వ్యక్తి వాహ నాల షోరూమ్‌లు, హోటళ్లలో పని చేసే వ్యకులతో పెట్టుబడి పెట్టించాడు. ఇలా ఆసిఫాబాద్‌, మంచిర్యా ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున కస్టమ ర్లను చేర్పించారు. చైన్‌ లింక్‌ విధానంతో సామాన్యు లను ఆకట్టుకున్నారు. మేలో ప్రారంభమైన ఈ స్కీమ్‌ మె ల్లమెల్లగా వేల సంఖ్యలో మెంబర్‌షిప్‌లను చేర్చే స్థితికి వచ్చింది. గత వారం ముంబై కేంద్రంగా సందీప్‌ ఠండన్‌ అనే వ్యక్తి వారంలో తనకు రూ.7కోట్ల లాభాలు వచ్చాయ ని, రూ.2కోట్లు చైన్‌ లింక్‌ భాగస్వామ్యులకు పంచుతా నంటూ ఆఫర్‌ పెట్టాడు. ఈ రెండు రోజుల్లో రూ.10వేలు డిపాజిట్‌ చేసినవారికి రూ.20 వేలు, లక్ష డిపాజిట్‌ చేసిన వారికి రూ.2లక్షలు ఇస్తా మంటూ నమ్మించాడు. దీంతో ఇందులో సభ్యులుగా ఉన్న వారు రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల మేర డిపాజిట్‌ చేశారు. సోమవారం యాప్‌ను క్లోజ్‌ చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గురువారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీని వాస్‌ను కలిసి గోడును వెల్లబోసుకున్నారు. గోదావరి ఖనిలోని కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:13 AM