Share News

బడ్జెట్‌లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:28 AM

బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌ వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు.

 బడ్జెట్‌లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు

గణేశ్‌నగర్‌, జూలై 26: బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌ వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి అసంపల్లి వినయ్‌ సాగర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం పైన ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిరాశ మిగిల్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసుతులు లేక, స్కాలర్‌షిప్స్‌ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించి బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఇషాక్‌, బోగేశ్‌, సురేష్‌, సుస్మిత పాల్గొన్నారు.

ఫ విద్యారంగానికినిధులుపెంచాలి

భగత్‌నగర్‌: రాష్ట్ర బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్‌చేశారు. శుక్రవారం నగరంలోని కమాన్‌ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధి పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజాపాలనలో విద్యారంగం అభివృద్ధికి అదిక నిధులు కేటాయించక పోవడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిపెస్టోలో పెట్టినట్లు విద్యారంగానికి 15 శాతంనిదులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చ రమేష్‌, జేరిపోతుల జనార్దన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రేణికుంట్ల ప్రీతం, అక్రమ్‌ మాలిక్‌, రామారపు వెంకటేష్‌, సంగెం మధు, నాయకులు మామిడిపల్లి హేమంత్‌, రామగల్ల నరేష్‌, కనకం సాగర్‌, కేశబోయిన రాము, అలువాల విష్ణు, సందీప్‌రెడ్డి, శ్రవణ్‌, సచిన్‌ వినయ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:28 AM