Share News

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , Publish Date - May 09 , 2024 | 01:20 AM

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్‌ చౌహాన్‌

- రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌

జగిత్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో మల్యాల మండలం రామన్నపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, మల్యాల పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను, సందర్శించిన అనంతరం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులు, రైస్‌ మిల్లర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జగిత్యాలకు వచ్చిన డీఎస్‌ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా జిల్లా పారా బాయిల్డ్‌ రైస్‌మిల్లర్లు, రా రైస్‌ మిల్లర్లు కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఎస్‌ చౌహాన్‌ మాట్లాడారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రైతులు అధైౖర్య పడవద్దని తెలిపారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందు కు ఎలాంటి సమస్య రాకుండా అధికారులు సమన్వయంతో పనిచే యాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రైస్‌మిల్లులకు తరలిం చి సకాలంలో వారి ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి డబ్బుల ఇబ్బంది లేదని, ధాన్యం అమ్ముకొని ఖాతాల్లో డబ్బులు పడ్డప్పుడే రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఇందుకు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, సివిల్‌ సప్లయి డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌) అభిషేక్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ రాంబాబు, జిల్లా సివిల్‌ సప్లయి అధికారి వేంకటేశ్వర్‌రావు, మేనేజర్‌ హతీరాం, డీఆర్‌డీఓ సంపత్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారిణి వాణి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రకాశ్‌, జిల్లా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నవీన్‌, నాయకులు మధు, రా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నూనె శ్రీనివాస్‌, మైలారపు రాంబాబు, నాయకులు దువ్వ రాజు, జిల్లా లారీ ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు శ్రీనివాస్‌, బొమ్మెన శంకర్‌, సివిల్‌ సప్లయి శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:20 AM