Share News

నేడు విజయ దశమి

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:52 AM

చెడును తొలగించి మంచిని వెలిగించేదిగా దసరా పండుగను జరుపుకుంటారు. శక్తి స్వరూపిణి దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడ్ని వధించి లోకానికి మేలు కలిగించిందని ప్రతీతి. ఇదే రోజు రాముడు రావణడి సంహారం చేసినట్టుగా చెబుతారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన జిల్లా ప్రజలు విజయదశమి వేడుకలకు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజులు జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

నేడు విజయ దశమి

- వైభవంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు

- రాజన్న సన్నిధిలో అమ్మవారికి రోజుకో అలంకరణతో పూజలు

- పల్లెపల్లెన శమీపూజలకు ఏర్పాట్లు

- నేడు విజయ దశమి

- జిల్లా వ్యాప్తంగా రామలీల

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

చెడును తొలగించి మంచిని వెలిగించేదిగా దసరా పండుగను జరుపుకుంటారు. శక్తి స్వరూపిణి దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడ్ని వధించి లోకానికి మేలు కలిగించిందని ప్రతీతి. ఇదే రోజు రాముడు రావణడి సంహారం చేసినట్టుగా చెబుతారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన జిల్లా ప్రజలు విజయదశమి వేడుకలకు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజులు జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రోజుకో అలంకరణలో పూజలు నిర్వహించారు. మండ కేంద్రాలతోపాటు, పల్లెల్లో అమ్మవారి మండపాలను అమ్మవారిని పత్రిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమ్మవారి శోభాయాత్రలో శమీ దర్శనం, శమీ పూజలకు జమ్మిచెట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. ఫ్యాక్టరీల్లో, వృత్తి పనివారు ఆయుధాలకు బదులుగా తమ పరికరాలతో పూజలు నిర్వహిస్తారు. కొత్త వ్యాపారాలు, పనులు, దుకాణాలు, ప్రారంభించుకోవడానికి విజయదశమి రోజున ప్రాధాన్యం ఇస్తారు. విజయదశమి రోజు ప్రారంభోత్సవాలతో అన్నింటా విజయాలు లభిస్తాయని ప్రజల నమ్మకం.

మార్కెట్‌లో దసరా కొనుగోళ్లు

విజయదశమి సందర్భంగా మార్కెట్‌కు ప్రత్యేక శోభ వచ్చింది. ప్రజలు ఇంటికి అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లతోపాటు వాహనాల కొనుగోళ్లు చేస్తున్నారు. దసరాకు కావాల్సిన కొత్తదుస్తుల కోసం షాపింగ్‌మాళ్లు, దుకాణాలు కిటకిటలాడాయి. ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, వాషింగ్‌ మెషిన్లు, సెల్‌ఫోన్‌లు, రిఫ్రిజిరేటర్‌ల అమ్మకాలు కూడా పెరిగాయి. దుకాణ దారులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు.

నేడు రాం లీల

జిల్లా వ్యాప్తంగా శనివారం రామలీల కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సిరిసిల్ల మానేరు తీరంలో రాంలీల కార్యక్రమాన్ని వైభంగా నిర్వహించనున్నారు.

Updated Date - Oct 12 , 2024 | 12:52 AM