నేడు విజయ దశమి
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:59 AM
ఆశ్వీయుజ, శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు దేవీనవరాత్రులుగా జరుపుకుంటాం. ఆ తర్వాత రోజును దసరా పండుగగా పిలుస్తారు. దశమి నాడు ప్రారంభించే పనులు విజయవంతమవుతాయని నమ్మకం. విజయ ముహూర్తం కావడంతో ఈ రోజుకి విజయదశమి పేరు ఏర్పడింది.
- శమీ పూజలకు ఏర్పాట్లు
కరీంనగర్ కల్చరల్ అక్టోబరు 10: ఆశ్వీయుజ, శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు దేవీనవరాత్రులుగా జరుపుకుంటాం. ఆ తర్వాత రోజును దసరా పండుగగా పిలుస్తారు. దశమి నాడు ప్రారంభించే పనులు విజయవంతమవుతాయని నమ్మకం. విజయ ముహూర్తం కావడంతో ఈ రోజుకి విజయదశమి పేరు ఏర్పడింది. దశమి నాడు దేవీనవరాత్రుల్లో ప్రతిష్టించిన క లశానికి ఉద్వాసన, ఆయుధపూజ, శమీదర్శనం చేయడం ఆచారం. విజయ దశమిరోజు అజ్ఞాతవాసం ముగించుకున్న అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన తన గాండీవం తదితర ఆయుధాలను ఉత్తరుడి ద్వారా తీసుకున్నట్లు భారతం చెబుతోంది. రాముడు రావణుడిపై యుద్ధం చేసినప్పుడు దేవిలోని నవాంశలను తొమ్మిది రోజుల పాటు పూజించి పదవనాడు రావణుడిని సంహరించాడని రామాయణంలో ఉంది. విజయదశమి నాడు శమీ దర్శనం, పూజ చేస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకకంటకుడుగా మారి ముల్లోకాలలో స్వైర విహారం చేశాడు. తట్టుకోలేని దేవతలు మహిషాసురుడిని సంహరించాలని జగన్మాతను కోరగా మాత తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద ్ధం చేసి పదో రోజున రాక్షసుడిని సంహరించింది. రాక్షసపీడ విరగడైనందుకు గుర్తుగా దసరాగా జరుపుకుంటారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం ఉత్సవాలు జరుపుకోనున్నారు. శమీ పూజలకు ఆలయాలు మండపాల వద్ద పూజలు చేస్తున్నారు.