Share News

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - May 09 , 2024 | 12:34 AM

అకాల వర్షం వడగళ్ల వానతో వరి ధాన్యం, మామిడి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొని నష్టపరిహారం చెల్లిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

కాల్వశ్రీరాంపూర్‌, మే 8: అకాల వర్షం వడగళ్ల వానతో వరి ధాన్యం, మామిడి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొని నష్టపరిహారం చెల్లిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో మంగళవారం సా యంత్రం కురిసిన అకాల వర్షం వడగాల వానతో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని, వడగళ్ల వానతో మామిడి తోటల్లో నేలరాలిన కాయలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలిం చి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. నష్టపో యిన రైతుల వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులెవరూ అధైర్యపడ వద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుం ట విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం వడగళ్ల వాన పడడం బాధాకరమన్నారు. అకాల వర్షం, వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిలిందన్నారు. నష్టపోయిన రైతాంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తడిసిన ధాన్యా న్ని ప్రభుత్వ కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందో ళనకు గురి కావద్దన్నారు. మామిడి తోట రైతులకు వడగళ్ల వానతో నష్టం వాటిల్లిందని, తోటలోని మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి నష్టపరిహారం అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలాగా చూసి రాసు కొనిపోయి కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చి తంగా పరిహారం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షులు, సింగిల్‌ విండో చైర్మన్‌ చదువు రామచంద్రన్‌రెడ్డి, పులి ఇంద్ర కరణ్‌రెడ్డి, తుల మనోహర్‌రావు మాదాసి సతీష్‌ అల్లం దేవేందర్‌, సబ్బని రాజమల్లు, బంగారు రమే ష్‌, శివరామకృష్ణ, జిన్న రామచంద్రం రెడ్డి, పొట్యాల మొండయ్య, గోలి సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:34 AM