Share News

Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:21 AM

ఖమ్మం జిల్లా బోనకల్‌లో గుడి ముందు భిక్షాటన చేసుకునే ఓ యాచకుడికి ఐపీ (దివాలా దరఖాస్తు) నోటీసు రావడం చర్చనీయాంశమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..

Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు
Beggar Receive IP Notice

  • 50 వేలు అప్పు ఇవ్వగా.. దివాలా పిటిషన్‌ వేసిన వ్యాపారి

  • లబోదిబోమంటున్న యాచకుడి కుటుంబం


బోనకల్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా బోనకల్‌లో గుడి ముందు భిక్షాటన చేసుకునే ఓ యాచకుడికి ఐపీ (దివాలా దరఖాస్తు) నోటీసు రావడం చర్చనీయాంశమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లాల అశోక్‌ దంపతులు బోనకల్‌లోని సాయిబాబా ఆలయం వద్ద బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇంటర్‌ చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఓణీల కార్యక్రమం సందర్భంగా ఆలయ నిర్వాహకులు కొంత డబ్బు ఇచ్చారు. దాన్ని భిక్షాటన చేసి దాచుకున్న డబ్బుతో కలిపితే మొత్తం రూ.50 వేలు అయింది.


హోటల్ వ్యాపారి..

అశోక్‌ టిఫిన్‌ కోసం స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు వెళుతుంటాడు. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా రూ.50 వేలు కావాలని హోటల్‌ యజమాని నర్సింహరావు కోరగా.. అశోక్‌ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ప్రామిసరీ నోటు కూడా రాసిచ్చాడు. అయితే సదరు వ్యాపారి నర్సిహారావు వ్యాపారంలో నష్టాలపాలయ్యానంటూ రూ.2.75కోట్లకు ఐపీ దాఖలు చేశాడు. అందులో భాగంగా అశోక్‌కు కూడా ఐపీ నోటీసు వచ్చింది. ఇక తనకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదని, తన కుమార్తె భవిష్యత్‌ ఏంటని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 28 , 2024 | 09:24 AM