Temple Celebrations: మహిళా భక్తులకు పసుపు, కుంకుమ: సురేఖ
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:22 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో కార్తీకమాస వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో కార్తీకమాస వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సామూహిక కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఆ వేడుకలకు హాజరయ్యే మహిళా భక్తులకు ఉచితంగా పసుపు, కుంకుమ అందజేస్తామని ఆమె చెప్పారు. ప్రధాన ఆలయాల్లో మహిళా భక్తులకు బ్లౌజ్ పీసులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అవకాశమున్నచోట ప్రత్యేక ‘నది హారతి’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.