KCR: ఎన్నికల వేళ కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఈసీ సంచలన నిర్ణయం..
ABN , Publish Date - May 01 , 2024 | 06:47 PM
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై కొందరు ఈసీని ఆశ్రయించగా..
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై కొందరు ఈసీని ఆశ్రయించగా.. ఎన్నికల సంఘం తీవ్ర నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్.. తన వాగ్ధాటితో గాఢతను పెంచారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ పార్టీ నేతలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ప్రసంగం వీడియో కింద చూడొచ్చు..
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కేసీఆర్ ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్‌లను ఈసీకి అందజేశారు. ఆధారాలన్నింటినీ పరిశీలించిన ఎన్నికల కమిషన్.. కేసీఆర్ ప్రచార కార్యక్రమాలకు బ్యాన్ విధించింది. 48 గంటల పాటు ప్రచారం చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ రాత్రి 8.00 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించింది ఈసీ.