Share News

గణేష్‌ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:40 PM

వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

గణేష్‌ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో కిటకిటలాడుతున్న గద్వాల మార్కెట్‌ ఆవరణ

- జనంతో కిక్కిరిసిన మార్కెట్‌ ఆవరణ

- రద్దీగా మారిన విగ్రహాల విక్రయ కేంద్రాలు

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 6 : వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఉత్స వాల నిర్వహణకు అవసరమైన సరు కులు, పూలు, పండ్లు, పత్రి, చెరుకు గడలు, మొక్కజొన్న కంకులు కొను గో లు చేసేందుకు తరలివచ్చిన జనంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ఆవరణ కిక్కిరిసిపోయింది. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల విక్రయ కేంద్రాలు కొనుగోలు దారులతో రద్దీగా మారాయి. చుట్టుపక్క గ్రామాల నుంచి ఉత్సవ కమిటీల నిర్వాహకులు అధి కసంఖ్యలో తరలిరావడంతో గద్వాల పట్టణం కోలాహలంగా మారింది.

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : కలెక్టర్‌

గద్వాల న్యూటౌన్‌ : జిల్లా ప్రజలందరికి కలెక్టర్‌ బీఎం సంతోష్‌ వినాయక చవితి శుభాకాం క్షలు తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావ రణంలో జరుపుకోవాలన్నారు. వినాయకుడి ఆశీర్వాదంతో ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రమశిక్షణ పాటించి, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నదీ అగ్రహారం, జమ్మిచేడు, బీచుపల్లి, జూరాల డ్యాం ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:40 PM