Share News

ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్‌

ABN , Publish Date - May 07 , 2024 | 11:31 PM

ఇచ్చిన హామీలను గాలికి వదిలి, అధికారమే లక్ష్యంగా పనిచేసే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి విమర్శించారు.

ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్‌
గద్వాల పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

గద్వాల టౌన్‌/ మల్దకల్‌/ ధరూరు, మే 7 : ఇచ్చిన హామీలను గాలికి వదిలి, అధికారమే లక్ష్యంగా పనిచేసే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాలనలో అభివృద్ధికి బాటలు వేసిన బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసమర్థ కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు, తాగునీటి ఇక్కట్లు తలెత్తాయని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచిపోయిందన్నారు. రైతుబంధును ప్రశ్నార్థకంగా మార్చి, రుణమాఫీని వాయిదాలు, దేవుళ్లపై ఒట్లుగా మార్చారని ఎద్దేవా చేశారు. దేవుడు, మతం పేరుతో ఓట్లు అడిగే బీజేపీకి గుణపాఠం నేర్పాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ గడ్డం కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చెన్నయ్య, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ జి.వేణుగోపాల్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాయకులు సతీష్‌, గోవిందు, సాయిశ్యామ్‌రెడ్డి, కురుమన్న, ధర్మనాయుడు, గంగాధర్‌ గౌడ్‌, నెమలికంటి రామాంజి పాల్గొన్నారు. మల్దకల్‌ మండలంలోని అమరవాయి గ్రామంలో మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నాగర్‌కర్నూలు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, మహేష్‌ , గోపాల్‌, శ్రీధర్‌గౌడ్‌, రాములు, బుడ్డన్న, నాగన్న, మార్కులు ఉన్నారు. ధరూరు మండలంలోని మన్నాపురం, సోంపురం గ్రామాల్లో సీనియర్‌ నాయకుడు డీవై రామన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 07 , 2024 | 11:31 PM