Share News

లంచావతారులు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:11 PM

జిల్లాలో లంచావతారులు అధికమవుతు న్నారు.

లంచావతారులు
ఏసీబీకి చిక్కిన మక్తల్‌ సర్వేయర్‌ బాల్‌రాజ్‌(ఫైల్‌)

- అధికమవుతున్న అవినీతి

- పనులు కావాలంటే పైసలివ్వాల్సిందే..

- తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు

- లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారులు

నారాయణపేట, జూలై 26: జిల్లాలో లంచావతారులు అధికమవుతు న్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు పైసలివ్వనిదే పనులు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నిరుపేదలు ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని చేయించుకోవాల్సి వస్తే భయపడిపోతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాల్లో కొందరు చేయి తడపనిదే ఫైళ్లు కదలనివ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కొందరు ఉదాహరణగా తీసుకోవచ్చు. నాడు మరికల్‌ ఇన్‌ చార్జి తహసీల్దార్‌ లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడగా నేడు మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ వలలో సర్వేయర్‌ బాల్‌రాజ్‌ చిక్కాడు. దీంతో జిల్లా అధికార యంత్రా గం ఉలిక్కిపడింది. ఈ మధ్యకాలంలో గుండుమాల్‌ తహసీల్దార్‌ పాండు రైతుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడడ్డారు. ఈ నెల 25న మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని సర్వే యర్‌ బాల్‌రాజ్‌ రైతు వెంకటేష్‌ వ్యవసాయ పొలం సర్వే విషయంలో ముందుగా రూ.3వేలు తీసుకొని సర్వే చేయలేదు. రూ. 9వేలు ఇస్తేనే సర్వేకు వస్తాను అనడంతో రైతు ఏసీబీని అశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో సర్వేయర్‌ పట్టుకున్నారు. జిల్లాలో గతేడాది డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి జిల్లా మాస్‌ మీడియా అధికా రి హన్మంతు ఓ ప్రయివేటు ఆసుపత్రి అనుమతి కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ మధ్య కాలంలో రైతులు వివిధ పనుల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నా లంచం లేనిదే పనులు కావడం లేదనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గతంలో మరికల్‌ తహసీల్దార్‌ పట్టుబడ్డ కొన్ని రోజులకే అదే కార్యాలయంలో సిబ్బం ది కూడా అవినీతికి పాల్పడుతూ పట్టుబడ్డారు. దామరగిద్ద తహసీల్దార్‌ వెంకటేష్‌, గుండుమాల్‌ తహ సీల్దార్‌ పాండు, ధరణి ఆపరేటర్‌ రవీందర్‌లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గతం లో మరికల్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ జగన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తాహేర్‌లు ఏసీబీకి చిక్కారు. మరికల్‌ త హసీల్దార్‌ శ్రీధర్‌ విరాసత్‌ కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మక్తల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హాబీబొద్దీన్‌ రూ.75 వేలు లంచం తీసు కుంటూ 2019, నవంబర్‌ 21న ఏసీబీకి చిక్కాడు. దా మరగిద్ద జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం బాల కిష్టయ్య 2019 మార్చి 5న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 2018 లో నర్వ ఎంపీడీవో రాఘవ ఏసీబీకి పట్టుబడ్డారు. ఊట్కూర్‌ ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి 2018లో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మక్తల్‌ మండలం గుడిగండ్ల వీఆర్వో విష్ణు రూ.10వేలు లం చం తీసుకున్నారంటూ ఏసీబీకి చిక్కారు. ఇలా పలువు రు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతున్నా కార్యా లయాల్లో లంచావతారులు మాత్రం తగ్గడం లేదు. ఎవరు లంచం అడిగినా ఏసీబీని ఆశ్రయించాలని, టోల్‌ ఫ్రీ నంబరు 1064కు డయల్‌ చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:11 PM