Share News

కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదు

ABN , Publish Date - May 07 , 2024 | 11:29 PM

ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని, ప్రజలను మోసం చేయడం అబద్దపు మాటలు మాట్లాడటం కాంగ్రెస్‌ నైజం అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరు ణ అన్నారు.

కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదు
కోస్గిలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడుతున్న డీకే అరుణ

- బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

కోస్గి రూరల్‌, మే 7 : ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని, ప్రజలను మోసం చేయడం అబద్దపు మాటలు మాట్లాడటం కాంగ్రెస్‌ నైజం అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరు ణ అన్నారు. మంగళవారం కోస్గిలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ ఎమ్మె ల్యేలు వెంకటరమణారెడ్డి, రాజాసింగ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు ఆడబిడ్డను ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ముఖ్యమంత్రి అన్నది మరిచి జట్పీటీసీ స్థాయిలో మాట్లాడుతున్నాడన్నా రు. ఎక్కడి నుంచో కొడంగల్‌కు వచ్చి ఇక్కడి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యావ న్నారు. మళ్లీ ఎంపీగా ఎక్కడి నుం చో ఓ మనిషిని తీసుకొచ్చి ఓట్లు అడుగితే ఇక్కడి ప్రజలు నమ్మరని, స్థాని కురాలినైన డీకే అరుణకు ఓటు వేస్తరు తప్ప కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటు వేయరన్నారు. గతంలో రేవంత్‌ మామ ఎంపీగా ఉండి పాలమూరుకు చేసింది శూన్యమన్నారు. రేవంత్‌రెడ్డి నరేంద్రమోదీని ఇక్కడ తిడుతడు ఢిల్లీకి పోయి రాష్ట్రానికి నిధులు కావాలని అడుక్కుంటడని రాజాసింగ్‌ ఆరో పించారు. అమిత్‌షా వీడియోను మార్చి దుష్ప్రచారం చేసిండని, ఢిల్లీ పోలీసులు వచ్చేసరికి ముందే రాష్ట్ర పోలీసులతో అరెస్టు చేయించుకున్నాడ ని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ఓ సుద్దపప్పు ఆయనకు ఏం చేయాలో తెలియదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రశాంత్‌, వెంకటేష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 11:29 PM