Share News

కాంగ్రెస్‌ను సాగనంపాలి

ABN , Publish Date - May 08 , 2024 | 11:11 PM

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చని కాంగ్రెస్‌ను ఎంపీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ను సాగనంపాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

ధన్వాడ, మే 8 : అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చని కాంగ్రెస్‌ను ఎంపీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేస్తుందన్న ఆశతో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని తీరా హామీలను ఏదీ అమలు చేయడం లేదన్నారు. మండలంలోన కిష్టాపూర్‌, హన్‌మన్‌పల్లి గ్రామాల్లో బుధవారం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ చేసిన మోసం గ్రహించి ఇప్పుడు ప్రజలు కారు కావాలని కోరుకుంటున్నారన్నారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అని చెప్పి మహిళలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, సునిల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కడపయ్య, గండి బాల్‌రాజు పాల్గొన్నారు.

నారాయణపేట వైద్య విభాగం : జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి బుధవారం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వచ్చినప్పటి నుంచి కరెంట్‌ కష్టాలు వచ్చాయన్నారు. దీంతో పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సుతారి రాంరెడ్డి, కడెంపల్లి రఘు, బండి మల్లారెడ్డి, పోషల్‌ సంతోష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:11 PM