Share News

పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ కృషి

ABN , Publish Date - May 07 , 2024 | 11:29 PM

పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అన్నారు.

పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ కృషి
పార్టీలో చేరిన మైనారిటీ నాయకులతో సంపత్‌కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- మానవపాడు మండలంలో ఎన్నికల ప్రచారం

మానవపాడు/వడ్డేపల్లి/రాజోలి/అలంపూర్‌/ అయిజ, మే 7 : పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల కేంద్రం సమీపంలోని ఆర్డీఎస్‌ డీ-40 కాలువ వద్ద పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరిగిందని, తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఉపాధి కూలీలకు ప్రతీ రోజు నాలుగు వందలు అందించేం దుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. మండల కేంద్రంలో మాజీ ఉప సర్పంచు పైల్వాన్‌తో పాటు 30 మంది మైనారిటీ నాయకులు సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగన్‌ నాయుడు, సిరాజ్‌, పరమేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే సమగ్రాభివృద్ధి

దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ మండల నాయకుడు అజయ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ గౌడ్‌, అంజి, కరువరాజు, బజారీ, సురేష్‌ పాల్గొన్నారు.

- రాజోలి మండల కేంద్రంతో పాటు, పడమటి గార్లపాడులో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు. కార్యక్రమంలో నాయకులు మూగన్న, ఉప్పరి కృష్ణ, రశీదు, సీపీఎం మండల కార్యదర్శి విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

- అలంపూర్‌ పట్టణంలోని సంతోష్‌నగర్‌కాలనీలో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బుచ్చన్న, ధర్మరాజు, భాస్కర్‌, తిరుపాల్‌, స్వాములు పాల్గొన్నారు.

- అయిజ పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అడ్వకేట్‌ మధుకుమార్‌ ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు నజీర్‌అహ్మద్‌, దూద్‌పాష, చంటి పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 11:29 PM