పాత భవనాన్ని కూల్చేయండి
ABN , Publish Date - Sep 06 , 2024 | 11:36 PM
పాత భవనాన్ని కూల్చేయండి.. నూతన భవనంలో ని తరగతి గదులను మరమ్మతు చేయండని రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మీ తెలిపారు.
- పీటీజీ తరగతి గదులను మరమ్మతు చేయాలి
- రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మీ
మన్ననూర్, సెప్టెంబరు 6: పాత భవనాన్ని కూల్చేయండి.. నూతన భవనంలో ని తరగతి గదులను మరమ్మతు చేయండని రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మీ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్న నూరులోని ఆదిమవాసీ గురుకుల విద్యాలయాన్ని (పీటీజీ) ఆమె శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. పీటీజీకి రెండు భవనాలు ఉన్నాయి. ఇకటి పురాతన మైంది. మరొకటి ఇటీవల నిర్మించింది. ఈ రెండు భవనాలను ఆమె పరిశీలించా రు. ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్న భవనంలోని ఒక గది వర్షాలకు కూలింది, మరికొన్ని తరగతి గదులను కూడా మరమ్మతులు చేయాల్సి ఉన్నవి. వీటిని పరిశీలించిన ఆమె శిథిలావస్థలో ఉన్న ఈ పాత భవనాన్ని పూర్తిగా కూల్చి వేయాలని, మిగతా గదులను మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. పీటీజీ విద్యార్థులకు ఆటవిడుపు కోసం కిన్నెర గార్డెన్‌ను నిర్మించాల ని, అందుకు తగిన నిధులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తరగతి గదులకు మరమ్మతులు చేసే క్రమంలో విద్యార్థులకు పక్కనే ఉన్న ఆర్‌ఐటీఐ భవనంలో తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు అవసరమయ్యే బాత్ రూమ్, టాయిలెట్‌లను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం, పోషక విలువలుండే స్నాక్స్ ఇవ్వాలన్నారు. పీటీజీలోని 3,7వ తరగతి, కళాశాల విద్యార్థులతో విద్యా సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థు లకు చదువుతో పాటుగా శారీరక వ్యాయామం, యోగా, క్రీడల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గురుకులం భవన నిర్మాణాలకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో రోహిత్ గోపిడి, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వెంకటేశ్వర సింఘ్, ఏఈ రఘు, పీటీజీ ప్రిన్సిపాల్ గోవర్ధన్ పాల్గొన్నారు.