Share News

డయల్‌ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:16 PM

డయల్‌ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశించారు.

డయల్‌ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలి
రాజోలి పోలీస్‌స్టేషన్లో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

- ఎస్పీ శ్రీనివాసరావు

- రాజోలి, మానవపాడు పోలీస్‌ స్టేషన్ల తనిఖీ

రాజోలి/ మానవపాడు, జులై 26 : డయల్‌ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశించారు. రాజోలి, మానవపాడు పోలీస్‌స్టేషన్లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డు లను పరిశీలించారు. రాజోలిలో ఎస్‌ఐ జగదీశ్వర్‌తో మాట్లాడి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని సూచించారు. ఆయన వెంట శాంతినగర్‌ సీఐ టాటాబాబు, ఎస్‌ఐలు చంద్రకాంత్‌, సంతోష్‌, జగదీశ్‌ ఉన్నారు. మానవపాడు పోలీస్‌స్టేషన్లో రికార్డుల ను తనిఖీ చేశారు. స్టేషన్‌ ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర ప్రవృత్తిగల వారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ చంద్రకాంత్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయం

గద్వాల క్రైం : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, సంరక్షించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. వన మహోత్సవంలో భాగంగా గద్వాల పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే భవిష్యత్‌ తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే నన్నారు. మొక్కలు నాటే బాధ్యతను ప్రతీ ఒక్కరు స్వీకరించాలని కోరారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో 605 మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ గుణశేఖర్‌, డీఎస్పీ సత్యనారాయణ, కార్యాలయ ఏవో సతీష్‌కుమార్‌, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు వెంకటేష్‌, హరీశ్‌, సూపరింటెండెంట్‌ నయీం, టౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌, రూరల్‌ ఎస్‌ఐ పర్వతాలు, ఎస్‌ఐలు రజిత, జి.రజిత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:16 PM