Share News

లక్ష్య సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:19 PM

సంపూర్ణత అభియాన్‌ లక్ష్య సాధన వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.

లక్ష్య సాధనకు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

- అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

గద్వాల న్యూటౌన్‌, జూలై 26 : సంపూర్ణత అభియాన్‌ లక్ష్య సాధన వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. నీతి అయోగ్‌ - ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాం కింద గట్టు మండలం ఎంపికయ్యింది. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపూర్ణత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖలో మూడు సూచికలైన ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్‌, డయాలసిస్‌, హైపర్‌టెన్షన్‌ స్ర్కీనింగ్‌ను సెప్టెంబరు చివరి నాటికి వంద శాతం పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సిద్ధప్ప మాట్లాడుతూ నీతి అయోగ్‌ ఇచ్చిన ఇండికేటర్లను వంద శాతం పూర్తి చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాజు, మాధవి, శ్యాంసుందర్‌, నీటి అయోగ్‌ కో-ఆర్డినేటర్‌ అఫ్జల్‌, గట్టు మండల సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:19 PM