మాజీమంత్రి సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌కు బెయిల్
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:31 PM
మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌కు బెయిల్ మంజూ రైంది.
విడుదలయ్యాక పరామర్శించిన మాజీమంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, నవంబరు20(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌కు బెయిల్ మంజూ రైంది. నాలుగో తరగతి ఫస్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బుధవా రం బెయిల్ మం జూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెలకోసారి ఆయన రూరల్ పోలీస్‌స్టేష న్ వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. అక్టోబరు 26న అచ్చంపేట కోర్టు జ్యుడిషి యల్ రిమాండ్ విధించగా అదేరోజు మహబూ బ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. 26 రోజుల అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. కాగా సాయంత్రం 5 గంటలకు బెయిల్‌పై జైలునుంచి విడుదలైన ఆయన అనుచరులతో కలిసి నేరుగా మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసానికి చేరుకు న్నారు. జిల్లా పర్యటనలో ఉన్న మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి, మాజీఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఇంటికి చేరుకున్న శ్రీకాంత్‌గౌడ్‌ను పరామర్శించారు.
ప్రశ్నించేవారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు: మాజీమంత్రి హరీశ్‌రావు
ప్రజల పక్షాన ప్రశ్నించేవారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. శ్రీకాంత్‌గౌడ్‌ను పరామర్శించిన అనంతరం ఆయ న మాట్లాడారు. ప్రభుత్వం పేదలు అంధుల ఇళ్లను కూల్చివేస్తే కూల్చివేసిన చోటే మళ్ళీ అం ధులకు ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని ప్రశ్నించినందు కుతప్పుడు కేసులు నమోదుచేసి జైలుకు పంపిం చారన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుం బం మహబూబ్‌నగర్ అభివృద్ధి, పేదల సంక్షే మం కోసం నిరంతరం పనిచేసిందని పేర్కొన్నా రు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.