Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:03 PM

రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

- తహసీల్‌ ముందు పీడీఎస్‌యూ ధర్నా

మక్తల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయ కుడు కిరణ్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.6,350 కోట్ల ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా విద్యా రంగ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా వెంటనే బకాయి ఫీజులు విడుదల చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్ర మంలో పీడీఎస్‌యూ నాయకులు అజయ్‌, చెన్నయ్య, విజయ్‌, గణేష్‌, రాకేష్‌, రాజశేఖర్‌, గోవిందు, సాయికుమార్‌, లింగప్ప, సంతోష్‌, నరేందర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:03 PM