Share News

న్యాయ చట్టాలను బాలికలు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:17 PM

న్యాయచట్టా లపై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని, ము ఖ్యంగా బాలికలు న్యాయచట్టాలను సద్వినియో గం చేసుకునేలా వారికి అవగాహన కల్పించాల ని జిల్లా న్యాయఅధికారసేవాసంస్థ చైర్మన్‌, జిల్లా న్యాయాధికారి పాపిరెడ్డి అన్నారు.

న్యాయ చట్టాలను బాలికలు వినియోగించుకోవాలి

- జిల్లా న్యాయాధికారి పాపిరెడ్డి

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 23: న్యాయచట్టా లపై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని, ము ఖ్యంగా బాలికలు న్యాయచట్టాలను సద్వినియో గం చేసుకునేలా వారికి అవగాహన కల్పించాల ని జిల్లా న్యాయఅధికారసేవాసంస్థ చైర్మన్‌, జిల్లా న్యాయాధికారి పాపిరెడ్డి అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ ఎస్టీఆర్‌ మహిళా అటానమస్‌ డిగ్రీ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తావరకు న్యాయ చట్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలికల దినో త్సవం అనేది ఒక్కరోజే కాకుండా ప్రతీరోజు ప్రతీ పౌరుడు తన దైనందిన జీవితంలో బాలికలు మహిళలు వారి పాత్ర ఎనలేనిదని, వారి హక్కు లు, బాధ్యతలను గుర్తు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, జిల్లాన్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి ఇందిర, మూడవ అదన పు జిల్లా సెషన్స్‌ జడ్జి శ్రీదేవి, మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ నిహారిక, ఎన్టీఆర్‌ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్‌ రాజే ంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:17 PM