Share News

ఊసరవెల్లి రంగులు మారిస్తే.. రేవంత్‌రెడ్డి తారీఖులు మారుస్తాడు

ABN , Publish Date - May 08 , 2024 | 11:21 PM

పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని ఆరు గ్యారెంటీల అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి డిసెంబరు తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తానని ఊసరవెల్లి రం గులు మిర్చినట్లుగా రేవంత్‌ రెడ్డి తారీఖులు మా రుస్తాడని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

 ఊసరవెల్లి రంగులు మారిస్తే.. రేవంత్‌రెడ్డి తారీఖులు మారుస్తాడు
అచ్చంపేట రోడ్‌ షోలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌

మాజీ మంత్రి కేటీఆర్‌

అచ్చంపేట/కల్వకుర్తి, మే 8: పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని ఆరు గ్యారెంటీల అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి డిసెంబరు తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తానని ఊసరవెల్లి రం గులు మిర్చినట్లుగా రేవంత్‌ రెడ్డి తారీఖులు మా రుస్తాడని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవా రం పట్టణంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భా గంగా ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరా జుతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్ని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ ప్రజల మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్నారని, 100 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని విమర్శించా రు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీతో పాటు రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల త ర్వాత రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి మారుతారని ఆరోపించారు. విద్యా వంతుడు ప్రవీణ్‌ కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు ఆశీర్వదిం చి 10నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడన్నారు. మోదీ పాలనలో 2కోట్ల ఉద్యోగాలు రాలేదని, బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడు తుంది తప్ప అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాము లు పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ లో చేరారని, ఎందుకు చేరారో అచ్చంపే ట ప్రజలకు సమాధానం చెప్పాలన్నా రు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంన్నారు. సీనియర్‌ నాయకులు అభిలాష్‌రావు, మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కష్టాలు కన్నీళ్లే: ఆర్‌ఎస్‌పీ

సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు క ష్టాలు, కన్నీళ్లే మిగిలాయని నాగర్‌క ర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు సం క్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, ఇంటి వద్దకే నీళ్లు, 24గంటల ఉచిత క రెంటు అందేవన్నారు. కల్వకుర్తి పట్ట ణంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా బీ ఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోకు మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎ మ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌లు హాజ రు కాగా రోడ్‌ షో అట్టహాసంగా కొన సాగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో ప్రవీణ్‌కు మార్‌ మాట్లాడారు. ప్రజలకు బంజారా భాషలో అభివాదం తెలిపారు. ప్రలోభా లకు లొంగకుండా ప్రజలంతా కారు గు ర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలి పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు స మిష్టిగా పని చేసి ప్రతి బూత్‌లో బీఆర్‌ ఎస్‌కు మెజార్టీ తీసుకురావాలని కోరా రు. ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివా స్‌రెడ్డి, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, కల్వకుర్తి మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వెల్దండ జడ్పీటీసీ విజితా రెడ్డి, దశరథ్‌నాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయ కులు సింగం విజయ్‌గౌడ్‌, కొండూరు గోవర్ధన్‌, శ్రీనివాస్‌యాదవ్‌, అర్జున్‌రావు, నిర్మలా, కల్వకుర్తి నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:21 PM