Share News

నిస్వార్థంగా పనిచేసేది కార్యకర్తలే

ABN , Publish Date - May 08 , 2024 | 11:08 PM

నిస్వార్థంగా పనిచేసేది కార్యకర్తలే అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి అన్నారు.

నిస్వార్థంగా పనిచేసేది కార్యకర్తలే
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి

కృష్ణ, మే 8 : నిస్వార్థంగా పనిచేసేది కార్యకర్తలే అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హిందూపూర్‌ గ్రామ శివారులో బసవేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మండల స్థాయి నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు ఎన్నికల పోటీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య ఉంటుందన్నారు. డీకే అరుణమ్మ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీనే ప్రధాన మంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు అమర్‌కుమార్‌ దీక్షిత్‌, ఓబీసీ రాష్ట్ర నాయకుడు శంకరోళ్ల రవికుమార్‌, ఇన్‌చార్జి కర్నెస్వామి, బొక్క బాలిరెడ్డి, సోమశేఖర్‌గౌడ్‌, విద్యాసాగర్‌, మల్లేష్‌, జయనందన్‌రెడ్డి, మాగనూరు మండలాధ్యక్షుడు శ్రీనివాసులు, నారాయణ, నల్లే నర్సప్ప, దండు రాఘవేంద్ర, నారాయణభట్‌, అశోక్‌ గౌడ పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : మండలంలోని ఏ బూత్‌ కమిటీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు అధిక మెజార్టీ తీసుకొస్తారో వారిని సొండ డబ్బులతో విమానయం చేయిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఊట్కూర్‌, పులిమామిడి గ్రామాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు డీకే అరుణ గెలుపు కోసం నిరంతరం పని చేయాలన్నారు. రేపు నారాయణపేటలో జరిగే మెదీ సభకు మండలం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. అంతకుముందు రాష్ట్ర నాయకుడు బి.కొండయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా కొల్లూర్‌ సింగిల్‌ విండో డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు మరో 30 మంది బీజేపీ పార్టీలో చేరారు. సమావేఽశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, బొక్క బాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు కర్నే స్వామి, భరత్‌, విజయ్‌కుమార్‌, కృష్ణయ్య గౌడ్‌, ఎంపీటీసీ సభ్యులు హన్మంతు, శివప్ప, కిరణ్‌, భరత్‌, రమేష్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:08 PM