Share News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:57 PM

ఈ వానాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదే విధంగా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గోపాల్‌పేట మండలం పాత తండా గ్రామస్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో డ్రై డే నిర్వహణను పరిశీలించిన అధికారి

గోపాల్‌పేట, జూలై 26 : ఈ వానాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదే విధంగా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు. శుక్రవారం ఉమ్మడి మండలంలోని గోపాల్‌పేట, పాత తండా, తల్పునూర్‌, నాగపూర్‌, బండరావిపాకుల గ్రామాల్లో ఆయన డ్రై డే నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ వానా కాలంలో ఇళ్ల చుట్టుపక్కల నీళ్లు నిలిచి దోమలు పుడ తాయని వాటి ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని కలెక్టర్‌ కోరారు. మురుగుకాలువల్లో ఎప్పటికప్పుడు పూడికలను తీసివేస్తూ నీరు సజావు గా సాగేలా చూసుకోవాలని, నీటి ట్యాంకులను శు భ్రం చేసిన తేదీలను తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని, దోమల నివారణకు చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. దోమలు గుడ్లు పెట్టి ఎలా వ్యాప్తి చెందుతాయో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గోపాల్‌పేట బాలుర హైస్కూల్‌లో వన మహోత్సవంలో భాగంగా ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. కస్తూర్భాగాంధీ పాఠశాలను సందర్శించి సదుపాయాలు, సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రేవల్లి మండల ప్రత్యేక అధికారి సుధీర్‌, గోపాల్‌పేట ఎంపీడీవో శంకర్‌, ఏపీవో నరేందర్‌, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

- వనపర్తి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని వాడవాడల్లో శుక్రవారం ప్రైడే డ్రైడే నిర్వహించారు. మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌తో కలిసి చైర్మన్‌ పుట్టపా కల మహేష్‌ 33వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ప్రజలు మునిసిపల్‌ సిబ్బందిపైనే ఆధారపడకుండా స్వచ్చందంగా ఇంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలన్నారు. 15వ వార్డులో వార్డు కౌన్సిలర్‌ బండారు కృష్ణ ఆధ్వర్యంలో ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటి పాత్రల్లో దోమల నివారణ మందు చల్లి ప్రజలకు అవగా హన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ ఉంగ్లం అలేఖ్య, ఏఈ సాయికిరణ్‌, శానిటరీ ఇన్‌స్పెక్ట ర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ రాజ్‌కుమార్‌, ఉంగ్లం తిరుమల్‌, ప్రత్యేక అధికారులు మోహన్‌, ఆనంద్‌, ఆర్‌పీలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాలొ ్గన్నారు. 23వ వార్డులో వార్డు కౌన్సిలర్‌ నందిమల్ల భువనేశ్వరి ఆధ్వర్యంలో ప్రైడే డ్రైడేను నిర్వహించారు. 18వ వార్డులో గంధం సత్యమ్మ శరవంద ఆధ్వ ర్యంలో ప్రైడే డ్రైడేను నిర్వహించారు. అంతకుముం దు మునిసిపల్‌ చైర్మన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించి, సమస్యలను గుర్తిం చారు.

- ఆత్మకూరు : పట్టణంలోని ఎనిమిదో వార్డులో చేపట్టిన డ్రై డే అవగాహన సదస్సుకు డిస్ర్టిక్‌ అడ్మిని స్ట్రేషన్‌ ఆఫీసర్‌ శ్రీనాథ్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, ప్రతీ ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే వీధుల్లో శుభ్రత, మురుగునీటి కాలువల్లో నీరు నిలిచిపోతే వార్డు ఆఫీసర్లకు తెలియజేయాలన్నారు. జిల్లా ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ వంశీ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి, కమిషనర్‌ నాగరాజు, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ సురేందర్‌గౌడ్‌తో పాటు, వార్డు ఆఫీసర్లు, పారి శుధ్య కార్మికులు, ఆర్పీలు పాల్గొన్నారు.

- శ్రీరంగాపురం : పరిషత్‌ కార్యాలయంలో డ్రైడే సందర్భంగా మండల అధికారులు, గ్రామ కార్యదర్శు లతో ప్రత్యేకాధికారి నుషిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలానికి ఇచ్చి న వన మహోత్సవం టార్గెట్‌ పూర్తి చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో పరిషత్‌ అభివృద్ధి అధికారి రవీంద్ర, పంచాయతీ అధికారి రాజు, ఆయా గ్రామాల గ్రామ కార్య దర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

- పాన్‌గల్‌ : ఫ్రైడే డ్రైడే సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో హెల్త్‌ అసి స్టెంట్‌ రాంచందర్‌ జ్వరపీడిత సర్వే నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్‌ వ్యాధులు దరి చేరవని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరశురాం, ఏఎన్‌ఎం శ్రీలక్ష్మి, కారోబార్‌ ఆంజనేయులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- అమరచింత : మునిసిపల్‌ కేంద్రంలో శుక్రవారం పలు వార్డుల్లో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మ ప్ప ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య పనులపై ఆరా తీశారు. ఏడవ వార్డులో మొక్కలను నాటి ప్ర భుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా బోర్డులను ఏర్పాటు చేయించారు. అనంతరం ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంగమ్మ, కమిషనర్‌ నూరుల్‌నజీబ్‌, అధికారి కృష్ణయ్య, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు, మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

- వీపనగండ్ల : మండల కేంద్రంలో డ్రై డే సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బందితో కలిసి వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. ప్రజలకు వ్యాధుల పట్ల అవ గాహన కల్పించారు.

Updated Date - Jul 26 , 2024 | 10:57 PM