Share News

బాలల హక్కులను కాపాడుకుందాం

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:58 PM

బాలల హక్కు లను కాపాడుకుందామని వనపర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి బి.శ్రీలత అన్నారు.

బాలల హక్కులను కాపాడుకుందాం
విద్యార్థినుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న న్యాయాధికారి శ్రీలత

- జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి శ్రీలత

వనపర్తి రూరల్‌, జూలై 26 : బాలల హక్కు లను కాపాడుకుందామని వనపర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి బి.శ్రీలత అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో ‘బాలల హక్కులు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. బాలల కోసం రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించిందని వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఆశించిన లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అలాగే విద్యార్థి దశలోని చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మహిళల కోసం సఖి కేంద్రాలు అమలవుతున్నాయని ఏవై నా సమస్యలు తలెత్తితే ఆ కేంద్రాలను సంప్ర దించి, సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నా రు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు, సఖి కేంద్రం లీగల్‌ అడ్వయిజర్‌ కృష్ణ య్య, న్యాయవాదులు నరేందర్‌బాబు, నిరంజన్‌ బాబు, సఖి కేంద్ర నిర్వాహకురాలు ఎం.కవిత, కళాశాల ప్రధానాచార్యులు ఇందిర, ఝాన్సీభాయి, అధ్యాపకులు శారా, అనిత, సుప్రియ, సిబ్బంది, లోక్‌ అదాలత్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:58 PM