Share News

లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:14 PM

మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెందేలా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, జూలై 26 : మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెందేలా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా, మండల సమాఖ్య సభ్యులు, అధికారులు, బ్యాంకర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు జిల్లాలో చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు 6,675 యూనిట్లకు రూ. 54.04 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. స్కూల్‌ యూనిఫామ్స్‌ స్టిచ్చింగ్‌ యూనిట్స్‌, మీ సేవా కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, పౌలీ్ట్ర, ఫిష్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ ఉపకరణాలు రైతులుకు అద్డెకు ఇచ్చేలా యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాను వెంటనే బ్యాంకర్లకు పంపించి, రుణాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, అడిషనల్‌ డీఆర్‌డీవో నరసింహులు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ విలాస్‌రావు, రామ్మూర్తి, ఏపీఎంలు, డీపీఎంలు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:14 PM