Share News

ప్రతీ ఎకరాకు సాగునీరు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:14 PM

ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ ఎకరాకు సాగునీరు
నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యేలు జీఎంఆర్‌, పర్ణికారెడ్డి

- ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర, జూలై 26 : ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి పూజలు చేసి కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ముందుగా కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు వద్ద నాయకులు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులోకి జూరాల నీరు వచ్చి చేరడంతో వానాకాలం పంటకు నీటిని విడుదల చేశామని తెలిపారు. మరో రెండు రోజుల్లో జూరాల నుంచి నీటిని విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపుతామన్నారు. 10 రోజుల వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెకట్రరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మండల నాయకులు, ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:14 PM