Share News

పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - May 08 , 2024 | 11:47 PM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేలా సెక్టోరియల్‌ అధికారులు, పోలీస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌ అన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, మే 8 : పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేలా సెక్టోరియల్‌ అఽధికారులు, పోలీస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్టోరియల్‌, పోలీస్‌ అఽధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆటంకాలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. ఈ నెల 13న ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు సకాలంలో రాకపోతే, 15 నిమిషాలు వేచి చూసి మాక్‌ పోలింగ్‌ ప్రారంభించా లన్నారు. ఎస్పీ రితిరాజ్‌ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని, ఆ తర్వాత ఎక్కరిని కూడా కేంద్రం లోనికి అనుమతించొద్దని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, డీఆర్‌డీవో నర్సింగరావు, ఆర్డీవో రాంచందర్‌, అధికారులు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి

ఎన్నికల సందర్భంగా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎస్పీ రితిరాజ్‌ అన్నారు. ఎన్నికల రోజు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న మొబైల్‌ రూట్‌లలో ఏదైనా సంఘటన జరిగితే క్షణాల్లో లోకల్‌ ఎస్‌ఐ, సెక్టోరియల్‌ అధికారి, రూట్‌ మొబైల్‌ బృందం అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మొబైల్‌ రూట్‌లు, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు, క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు, వాటికి కేటాయించిన పోలీస్‌ అధికారుల వివరాలను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎస్‌ఐలు, మొబైల్‌ రూట్‌ ఇన్‌చార్జీలు సంబంధిత రూట్‌ సెక్టోరియల్‌ అధికారి కంటాక్ట్‌ మొబైల్‌ నెంబర్‌ను తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. కొన్ని రూట్‌లలో రెండు పోలీస్‌ స్టేషన్‌లకు సంబంధించిన గ్రామాలు ఉంటాయని తెలి పారు. ఆ రూట్‌లలోని సెక్టోరియల్‌ అధికారితో రెండు పోలీస్‌స్టేషన్లకు సంబంధించిన ఎస్‌ఐలు సమన్వ యంతో ఉండాలన్నారు. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తితే ఎస్‌ఐలు నియోజకవర్గాల వారీగా ఉన్న నోడల్‌ అధికారికి తెలపాలన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:47 PM