Share News

ట్రాఫిక్‌ నియంత్రణే ధ్యేయంగా ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:01 PM

జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్‌ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదా రుల కు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్‌ శాఖ నిరంతర పని చేస్తుందని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునా థ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించా రు.

ట్రాఫిక్‌ నియంత్రణే ధ్యేయంగా ప్రత్యేక చర్యలు
పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

- ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభంలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, జూలై 26 : జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్‌ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదా రుల కు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్‌ శాఖ నిరంతర పని చేస్తుందని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునా థ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించా రు. ఈ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు ముగ్గురు ఏ ఎస్‌ఐలు, మొత్తం 14మంది పోలీస్‌ సిబ్బందితో ట్రాఫిక్‌ నియంత్రణలో పని చేస్తారన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు అయిన బస్టాండ్‌ కూడలి, శ్రీపురం చౌరస్తా, ప్ర భుత్వ ఆసుపత్రి, నాగనూల్‌ చౌరస్తాతో పాటు కొల్లాపూ ర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ వ్యవహారా లు వంటివి నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా వాహనాలను తనిఖీ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 22 పోలీస్‌స్టేషన్లలో వాహనదారులకు ప్ర త్యేక అవగాహన కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన చట్టాలు ఎంతో కఠినంగా ఉన్నాయని వాహనదారులు ప్రభుత్వ నిబంధన లకనుగుణంగా వ్యవహరించాలన్నా రు. మద్యం తాగి వాహనాలు నడిపి నట్లయితే జైలు జీవితం అనుభవిం చాల్సిందేనని అన్నారు. ప్రతీ వాహనదారుడు తమ వా హనానికి నెంబరు ప్లేటుతోపాటు ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, హె ల్మెట్‌ ధరించి లైసెన్సు కలిగి ఉండాలని ఆయన పేర్కొ న్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వారితోపా టు వాహన యజమాని కూడా జైలుకు వెళ్లే నూతన చ ట్టాలు వచ్చాయని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్‌ నియంత్రణ కోసం కల్వకుర్తి శ్రీశైలం హైవేలతో పాటు హైదరాబాద్‌, కొల్లాపూర్‌ వంటి రోడ్లను సైతం తరచుగా పోలీస్‌సిబ్బంది పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌యా దవ్‌, కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్‌బీ డీఎస్పీ చారి, నాగర్‌కర్నూల్‌ సీఐ కనకయ్య, ఎస్‌ఐ గోవర్ధన్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ కల్యాణ్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:01 PM