Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:09 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం పదినెలల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగులు, ప్రజల పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని

కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

- విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం పదినెలల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగులు, ప్రజల పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ జి ల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రం లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ అన్నదాతలకు సేవలు అం దించే 170 ఏఈవోలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసి వేదింపులకు గురిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా రెండు లక్షల ఉద్యో గాలు ఏమోగాని ఉన్న ఉద్యోగులను తొలగిస్తుంద న్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి సిగ్గు లేకుండా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలను వేదిస్తోందన్నారు. ఎన్నికల హామీలు విస్మ రించి వయనాడ్‌ ఉప ఎన్నికల్లో ప్రియాంకగాంధీ గెలుపు కోసం మూటలు మోసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యు డు శ్రీశైలం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకట య్య, బీఆర్‌ఎస్‌ తిమ్మాజిపేట మండల అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:09 PM