Share News

అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:48 PM

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికీ రానన్ని పదవులను అలంపూర్‌కు తీసుకొస్తానని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.

అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను సన్మానించి మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్పకు సన్మానం

ఎర్రవల్లి/ అయిజ/ రాజోలి, సెప్టెంబర్‌ 6 : నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికీ రానన్ని పదవులను అలంపూర్‌కు తీసుకొస్తానని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. ఎర్రవల్లి, అయిజ, రాజోలి మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఎర్రవల్లిలోని ఎస్‌ఎస్‌ అడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశం లో అలంపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మ్డన్‌ దొడ్డప్పతో పాటు, డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం అయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంద న్నారు. భారీ వర్షాలకు నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు కోతలకు గురయ్యాయన్నారు. ఈ పరిస్థితులపై కలెక్టర్‌తో సమీక్షించానని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌తో మాట్లాడినట్లు తెలి పారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పనులను త్వ రలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ కమిటీల్లో కార్యకర్తలే కీలకంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ అలంపూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జోగుల రవి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్‌, కార్యదర్శి సిరాజ్‌, నాయకులు నీలిశ్రీనివాస్‌, సోమనాద్రి, సీతారామిరెడ్డి, రాజ్‌కుమార్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కుమార్‌, డైరెక్టర్లు రుక్మానందరెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, మస్తాన్‌, సులో చన పాల్గొన్నారు.

కాంట్రాక్టర్లను వెనుకేసుకురావొద్దు

కాంట్రాక్టర్లను వెనుకేసుకు రావడం కాదు, పనులు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిజ పట్టణ సమీపంలోని పొలోని వాగుపై వంతెన నిర్మాణ పనులను శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం డీఈ కిరణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. వంతెన నిర్మా ణం ఆలస్యం అవుతోందని, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన కూలిపోయిందని, అయినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీఈ సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు తెగిపోవడంతో మంత్రాలయం, ఎమ్మి గనూర్‌, ఆదోని, బెంగళూరుకు వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్ప, నాయకులు లక్ష్మీకాంతరావు, చంద్రన్నగౌడు, దేవేంద్ర, మైనర్‌బాబు, జైనుద్దీన్‌, రంగన్న, కౌన్సిలర్‌ దేవరాజు ఉన్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులోని సుంకేసుల డ్యాం కరకట్ట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌ అన్నారు. కరకట్ట కోతకు గురవు తున్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాజోలి మండల అధ్యక్షుడు దస్తగిరి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన ఆయన శుక్రవారం సుంకే సుల డ్యాంను, కరకట్టను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆర్డీఎస్‌ ఆయకట్టుదారుల సంఘం మాజీ చైర్మన్‌ తనగల సీతారామిరెడ్డి మాట్లాడుతూ 2009లో వచ్చిన భారీ వరదలకు కరకట్ట కొట్టుకు పోయిందని తెలిపారు. దీంతో అప్పటి ప్రభుత్వం కరకట్టను నాసిరకంగా నిర్మించడంతో, ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైందని చెప్పారు. అనంతరం సంపత్‌కుమార్‌ ఇరిగేషన్‌ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరకట్ట ఎత్తు పెంచి, నాణ్యతగా నిర్మించాలన్నారు. అందుకు దాదాపు రూ. 200 కోట్లు అవసరమని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమావేశమై ప్రతి పాదనలు పెట్టాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలంటే, సీఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అఽధ్యక్షుడు దస్తగిరి, నాయకులు హసన్‌, కుర్వ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:48 PM