Share News

Manda krishna: ఎస్సీ వర్గీకరణ చేయకుండానే.. టీచర్‌ ఉద్యోగాలు ఎలా ఇస్తారు..?

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:25 AM

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ముందుగా తెలంగాణలోనే అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి..

Manda krishna: ఎస్సీ వర్గీకరణ చేయకుండానే.. టీచర్‌ ఉద్యోగాలు ఎలా ఇస్తారు..?

  • నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు: మంద కృష్ణ

బర్కత్‌పుర, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ముందుగా తెలంగాణలోనే అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. వర్గీకరణ చేయకుండానే బుధవారం ఎల్బీ స్టేడియంలో 11 వేల మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఎలా అందజేస్తున్నారని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు 1,650 ఉద్యోగాలు రావాలని.. ఇందులో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందన్నారు.


వర్గీకరణ చట్టం అమలు కాకపోవడం వల్ల మాదిగలకు కనీసం 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిని కాపాడుకోవడానికి మాలలతో కుమ్మక్కై రేవంత్‌రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 04:25 AM