Share News

BRS: ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా..: హరీష్‌రావు

ABN , Publish Date - Jul 14 , 2024 | 12:06 PM

సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

BRS:  ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా..: హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత (BRS Leadder), మాజీ మంత్రి హరీష్ రావు (Ex Minister Harish Rao) మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి (MLC Yadava Reddy), ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి (FDC Ex Chairman Vanteru Prathapa Reddy) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని, రైతులంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా రావాలని ప్రార్థించామన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చే అవకాశం ఉందని, మేడిగడ్డ వద్ద 40వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని హరీష్‌రావు అన్నారు. బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నప్పటికీ నదిలో ఉన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా నాలుగు మోటర్లు నడిపించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కరువు పరిస్థితుల్లో కాలేశ్వరం నీటిని తీసుకువచ్చి చెరువు కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా కాలేశ్వరం నుంచి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపి వాటి ద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని హరీష్‌రావు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సైబర్ వలలో మోసపోయిన వ్యక్తి..

కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు: యనమల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 12:53 PM