Andole - Jogipet: చదువుకున్న బడికి ఎన్ఆర్ఐ ఆర్థిక సాయం.. వినూత్న కార్యక్రమాలతో ఆదర్శంగా పాఠశాల
ABN , Publish Date - Aug 06 , 2024 | 06:48 PM
జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే.
జోగిపేట: జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఓ పాఠశాలకి కూడా తోచిన సాయం చేయడానికి పూర్వ విద్యార్థి అయిన ఓ ఎన్ఆర్ఐ ముందుకు వచ్చారు. దీంతో బడిలో పలు సమస్యలకు పరిష్కారం దొరికినట్లైంది.
జోగిపేట(Jogipet) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగు నీటి సదుపాయం లేదు. 1988లో పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థి గండి మురళికి కొందరు ఈ సమస్యను వివరించారు. సమస్య తెలుసుకున్న ఆయన పాఠశాలలో తాగు నీటి సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు. నీటి ట్యాంక్ ఏర్పాటుతోపాటు పలు కార్యక్రమాల కోసం తన వంతు సాయం చేశారు. ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు మజ్జి త్రినాథ్‌రావుకి వసతులకు కావాల్సిన నగదుని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, మున్సిపల్ కమీషనర్ తిరుపతి, ఎంఈవో కృష్ణ, పీఆర్టీయూ పత్రికా సంపాదక వర్గ సభ్యుడు మాణయ్య, పీడీ వీబీ శ్రీనివాసులు, శ్రీకాంత్, ఎ.వెంకటేశం, శ్రీరాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం, స్వచ్ఛదనంలో ఆదర్శం..
చెట్ల పెంపకాన్ని జోగిపేట జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల బృందం సవాలుగా తీసుకుంది. ఇందుకోసం విద్యార్థులతో స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకుంటోంది. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ఎన్‌సీసీ కేడేట్లు జోగిపేట పట్టణంలో ప్రజలను చైతన్యపరచే రీతిలో, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అందోలు- జోగిపేట మున్సిపల్ ఛైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ ఛైర్మన్ డేవిడ్, మున్సిపల్ కౌన్సిలర్ డాకూరి శంకర్, ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మండల విద్యాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు
For Latest News and National News click here