Share News

Metro Deluxe Buses: గ్రేటర్‌కు 300 మెట్రో డీలక్స్‌ బస్సులు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:49 AM

గ్రేటర్‌లో మళ్లీ మెట్రో డీలక్స్‌ బస్సులు(Metro Deluxe Buses) అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల(Electric buses) రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో సెప్టెంబర్‌ నాటికి 300 మెట్రో డీలక్స్‌ బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.

Metro Deluxe Buses: గ్రేటర్‌కు 300 మెట్రో డీలక్స్‌ బస్సులు..

- నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు

- ఎలక్ట్రిక్‌ బస్సుల రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో మళ్లీ మెట్రో డీలక్స్‌ బస్సులు(Metro Deluxe Buses) అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల(Electric buses) రాక ఆలస్యంతో ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో సెప్టెంబర్‌ నాటికి 300 మెట్రో డీలక్స్‌ బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. జూలై నాటికి వందకుపైగా ఎలక్ట్రిక్‌ బస్సులు గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా ఒక్క బస్సు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికుల రద్దీతో సిటీ బస్సులపై ఓవర్‌లోడ్‌ పడుతున్నది.

ఇదికూడా చదవండి: ఔషధ వినియోగం తగ్గించండి.. ఆరోగ్యంగా ఉంటారు


మహాలక్ష్మి ఉచిత ప్రయాణం(Mahalakshmi Free Travel)తో సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో బస్సులు సరిపోవడం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రేటర్‌లో మెట్రో డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదని దీంతో టికెట్లతో వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 11:05 AM