Share News

Hyderabad: ఉపాధి పనులకు 1372 కోట్లు: మంత్రి సీతక్క

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:20 AM

ఉపాధి హామీ పనులకు మార్చి లోపు రూ.1372 కోట్లు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదు నెలల్లో చేయాల్సిన పనులపై డీఆర్‌డీవోలతో శనివారం

Hyderabad: ఉపాధి పనులకు 1372 కోట్లు: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పనులకు మార్చి లోపు రూ.1372 కోట్లు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదు నెలల్లో చేయాల్సిన పనులపై డీఆర్‌డీవోలతో శనివారం ఆమె వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.


మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు. ఇందిరా మహిళాశక్తి పథకాన్ని విజయవంతం చేయాలని, ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Updated Date - Nov 03 , 2024 | 04:20 AM