Share News

MLA Danam Nagender : ఇయ్యాల ఉంటావు.. రేపు పోతావు

ABN , Publish Date - Aug 14 , 2024 | 05:54 AM

‘ఇయ్యాల అధికారిగా ఉంటావు. రేపు వెళ్తావు. మేము ఇక్కడే పుట్టి పెరిగినవాళ్లం. ఇక్కడే ఉంటాం. రిటైర్‌గానే మీ ఊరికి వెళ్తావు. వంద కేసులు పెట్టినా నేను భయపడను. ప్రజల దగ్గరకు పోతాను. అధికారులపై ప్రివిలేజ్‌ మోషన్‌ (హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇస్తా. నా నియోజకవర్గంలోకి పోవద్దని చెప్పడానికి వారికేం అధికారమున్నది.

 MLA Danam Nagender :  ఇయ్యాల ఉంటావు.. రేపు పోతావు

  • నేను ఇక్కడే ఉంటా... వంద కేసులు పెట్టినా భయపడను

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై ఎమ్మెల్యే దానం మండిపాటు

హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) ‘ఇయ్యాల అధికారిగా ఉంటావు. రేపు వెళ్తావు. మేము ఇక్కడే పుట్టి పెరిగినవాళ్లం. ఇక్కడే ఉంటాం. రిటైర్‌గానే మీ ఊరికి వెళ్తావు. వంద కేసులు పెట్టినా నేను భయపడను. ప్రజల దగ్గరకు పోతాను. అధికారులపై ప్రివిలేజ్‌ మోషన్‌ (హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇస్తా. నా నియోజకవర్గంలోకి పోవద్దని చెప్పడానికి వారికేం అధికారమున్నది. హద్దు మీరి ప్రవర్తిస్తే వాళ్లకు మంచిది కాదు.. మాకూ మంచిది కాదు’ అంటూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌ నందగిరిహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ స్థలంలో ప్రహరీ కూల్చివేత ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదైంది. మంగళవారం హిమాయత్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దానం నాగేందర్‌ ఈ కేసుపై స్పందించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై మండిపడ్డారు.

ప్రహరీ కూల్చివేత ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్టు పంపించానని తెలిపారు. ఏవీ రంగనాథ్‌ కాదు కదా.. తననెవ్వరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. నాలాల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాలు చేస్తే చర్యలు తీసుకోవాలి కానీ.. ఎస్టీలు, పేదలు ఉండే బస్తీల్లో గుడిసెలు తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది కాకుండా ప్రైవేటు వాళ్లు దగ్గరుండి పార్కు ప్రహరీ కట్టిస్తున్నారని, దీని వెనక ఎవరున్నారో తేలాలన్నారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడినప్పుడు 190 కేసులుండేనని,తనపై ఇంకో పది కేసులు పెట్టుకున్న భయపడనని స్పష్టం చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 06:30 PM