Share News

MP Lakshman: అలా మోదీ ఏనాడూ చెప్పలేదు..

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:59 PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా విభజన హామీలను పరిష్కరించుకోవాలన్నారు.

MP Lakshman: అలా మోదీ ఏనాడూ చెప్పలేదు..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా విభజన హామీలను పరిష్కరించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు కట్టుబడి ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి హిందు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లో చిన్న వయసులో వైస్ ఛాన్సలర్‌గా ఎమ్మెల్సీగా, ఎంపీగా ఎన్నికయ్యారని లక్ష్మణ్ తెలిపారు.


పశ్చిమ బెంగాల్‌ను పాకిస్థాన్‌లో కలపాలని చూస్తే ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. జమ్మూ కశ్మీర్ కోసం ఉద్యమం చేసిన ముఖర్జీని అరెస్ట్ చేశారన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారసుడిగా ఇప్పుడు నరేంద్ర మోదీ ఆయన ఆశయాలను నెరవేస్తున్నాడని లక్ష్మణ్ తెలిపారు. భారత్ చిరకాల కోరికను నెరవేర్చిన ఘనత మోదీదేనన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఈడబ్ల్యూ రిజర్వేషన్ తీసుకొచ్చారన్నారు. కేవలం మత పరమైన రిజర్వేషన్లు తొలగిస్తామని మాత్రమే మోదీ అన్నారన్నారు. ఏనాడు రిజర్వేషన్లు తీసేస్తామని మోదీ చెప్పలేదని లక్ష్మణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి...

Hyderabad: ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డు మూసివేత..

బాబు వచ్చినా ‘మారలేదు’!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 12:59 PM