MP Eatala: దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి..
ABN , Publish Date - Sep 18 , 2024 | 10:08 AM
దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ది వ్యాంగుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.
హైదరాబాద్: దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ది వ్యాంగుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి బోయినపల్లిలో నిపిడ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్) ఆడిటో రియంలో మంగళవారం దివ్యాంగుల అభ్యున్న తికి కోసం సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) ముఖ్య అతిథి గా పాల్గొని సంస్ధ డైరెక్టర్ రామ్‌కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రా రంభించారు.
ఇదికూడా చదవండి: Special trains: దసరా-దీపావళి పండగలకు 48 ప్రత్యేక రైళ్లు..
జాతీయ, రాష్ట్ర నిధి ద్వారా దివ్యాంగులకు జాబ్ ఆఫర్ లెటర్‌లను, అర్హులైన లబ్ధిదారులకు మొబైల్ ఫోన్లు, బ్యాటరీతో నడిచే ట్రైసైళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దివ్యాంగుల అభ్యున్నతికి తన తోడ్పాటును అందించటానికి సహాయ సహకారాలందిస్తాన న్నారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవా లన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు భానుకా మల్లికార్జున్, కొల్లి నాగేశ్వరరావు, సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
....................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.....................................................................
Cyber criminals: వృద్ధుడి నుంచి రూ.8.94 లక్షలు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్..
- నకిలీ వెబ్‌సైట్లతో షేర్ మార్కెట్ పేరిట మోసం
హైదరాబాద్ సిటీ: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి నగరవాసిని మోసం చేసి రూ.8.94లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 56 ఏళ్ల వృద్ధుడికి వాట్సా్‌పలో ఒక మెసేజ్ వచ్చింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అందిస్తామని ఉంది. దాంతో అతడు ఆ లింక్ ఓపెన్ చేయగా ఓ గుర్తుతెలియని వ్యక్తి లైన్‌లోకి వచ్చి అతడిని బీ1 షేర్‌ఖాన్ క్యాపిటల్ గ్రూపులో యాడ్ చేశారు. ఇతరులు పెట్టుబడులు పెట్టి అధిక మొత్తంలో లాభాలు అందుకున్న స్ర్కీన్ షాట్స్ పెట్టి ప్రోత్సహించారు.
అ తర్వాత గూగుల్ ప్లేస్టోర్ నుంచి షేర్ కిపో అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. బాధితుడి నుంచి విడతల వారీగా రూ.8.94 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఆ డబ్బుతో మ్యాచ్ కాన్ఫరెన్స్ ఈవెంట్స్ లిమిటెడ్‌లో 600 షేర్‌లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో 10,700 షేర్లు కేటాయించినట్లు చూపించారు. దాంతో రిజిస్టర్డ్ ట్రాన్సఫర్ ఏజెంట్(ఆర్‌టీఏ) వెబ్‌సైట్లలో తనిఖీ చేయగా ఆయా కంపెనీల నుంచి ఎలాంటి షేర్‌లు కేటాయించలేదని తేలింది. దాంతో ఇదేదో మోసపూరితమైన కుట్రగా అనుమానించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి
ఇదికూడా చదవండి: ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు
ఇదికూడా చదవండి: రాసిపెట్టుకో.. రాజీవ్ విగ్రహం తొలగిస్తాం
Read LatestTelangana News andNational News