Share News

MP Etala: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:00 AM

‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.

MP Etala: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’

- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

హైదరాబాద్: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పని చేయడమే కాదు.. గెలిపించి మరింత బాధ్యత పెంచారన్నారు. ఈ సందర్భంగా ఈటలను శాలువాతో సత్కరించారు. ఎంపీని కలవడానికి వచ్చిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫొటోలు దిగారు.


మల్కాజిగిరి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఓటర్లకు ఆయన దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు, ప్రీతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- ఈటలకు శుభాకాంక్షలు

హైదర్‌నగర్‌: ఈటల రాజేందర్‌ను భట్రాజు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సీతారామరాజు, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌ రాజు, శ్రీరామరాజు, శ్రావణ్‌కుమార్‌ రాజు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 11:00 AM