Share News

మతోన్మాద బీజేపీకి గుణపాఠం చెప్పాలి

ABN , Publish Date - May 08 , 2024 | 12:11 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య కోరారు.

మతోన్మాద బీజేపీకి గుణపాఠం చెప్పాలి
చౌటుప్పల్‌లో రోడ్‌షో నిర్వహిస్తున్న వీరయ్య, పక్కన సీపీఎం అభ్యర్థి జహంగీర్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య

చౌటుప్పల్‌ టౌన, మే 7: పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం భువనగిరి సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలదోయడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విదానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేసే అవకాశం ఉందని, బీజేపీ పాపాలకు ఈ ఎన్నికల్లో పుల్‌

స్టాప్‌ పెట్టాలని ఆయన కోరారు. నిరంతరం పేద ప్రజల కోసం పోరాటాలను సాగిస్తున్న ప్రజా గొంతుక సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు ఎండి.పాషా, బత్తుల శ్రీశైలం, బండారు నర్సింహ, పైళ్ల ఆశయ్య, మనోహర్‌, దండ అరుణ్‌ కుమార్‌, జి.లక్ష్మణ్‌, ఆకుల ధర్మయ్య, గోశిక కరుణాకర్‌, దాడి సురేందర్‌రెడ్డి, శంకర్‌ పాల్గొన్నారు. అనంతరం చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో అభ్యర్థి జహంగీర్‌, వీరయ్య రోడ్‌ షో నిర్వహించారు.

Updated Date - May 08 , 2024 | 12:11 AM