Share News

ప్రచార హోరు

ABN , Publish Date - May 09 , 2024 | 12:09 AM

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెరపడనుంది. ప్రచార సమయం తుదిదశకు చేరుతుండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రచారాన్ని ము మ్మరం చేస్తున్నారు.

ప్రచార హోరు

తుదిదశకు చేరుతున్న ప్రచారం

మరో రెండు రోజులూ హోరెత్తనున్న పల్లెలు, పట్టణాలు

నేడు భువనగిరిలో అమిత్‌షా సభ

యాదగిరిగుట్టలో కేటీఆర్‌ రోడ్‌షో

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెరపడనుంది. ప్రచార సమయం తుదిదశకు చేరుతుండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రచారాన్ని ము మ్మరం చేస్తున్నారు.పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అ సెంబ్లీ నియోజకవర్గాల్లోని పల్లెలు, పట్టణాలు పలు పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తాయి.

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్నిపార్టీ లూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నెలరోజులుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం అభ్యర్థులు నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజలతో మమేకమవుతూ ముమ్మరంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. అయితే ఈస్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నా యి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఆయా పార్టీల అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పలు పార్టీల అగ్రనేతలు ఇప్పటి కే జిల్లాలో పర్యటించి, రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీల అధిష్ఠానాలు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అభ్యర్థులు అగ్రనేతలతో ప్రచారా న్ని నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏ పట్టణానికి, పల్లెకు వెళ్లినా అభ్యర్థులకు అనుకూలంగా పలు పాటలతో ప్రచార రథాలే దర్శనమిస్తు న్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉదయం వేళల్లో ప్రజలను కలు స్తూ, సాయంత్రం వేళ బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంటింటి ప్రచారంతోపాటు, కులసంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాల తో అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు హామీల మీద హా మీలు కురిపిస్తున్నారు. ఏ గ్రామంలో చూ సినా విధులన్నీ పలు పార్టీలకు చెంది న అభ్యర్థుల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, భారీగా ప్లెక్సీలతో నిండిపోయాయి.ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు,మాజీమంత్రులు, మాజీఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రంగంలోకి ది గి తమ అభ్యర్థులను గెలుపించుకునేందుకు సర్వం ఒడ్డుతున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్‌ సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో పోరు రసవత్తరంగా మారింది. దీంతో ప్రచారం రణ రంగాన్ని తలపిస్తోంది.

అగ్రనేతల ప్రచారం

ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలు భువనగిరి నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భువనగిరిలో ఈ నెల 9న బీజేపీ అగ్రనేత అమిత్‌షా బహిరంగసభలో పాల్గొంటారు. ఉదయం 10నుంచి 12గంటల సమయంలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల చౌటుప్పల్‌ మండలంలో నిర్వహించిన బహిరంగసభకు బీజేపీ అధినేత జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థులను బలపరచాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌నేతలు పర్యటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు తమ మద్దతు తెలిపాలని, రాష్ట్రంలోని రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని భువనగిరి వేదికగానే ముఖ్యమంత్రి ప్రకటించారు.చౌటుప్పల్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, లేనిపక్షంలో రాహుల్‌గాంధీతో బహిరంగసభను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంవతో అగ్రనేతలు సమయం ఇచ్చిన పక్షంలో సభ నిర్వహించేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే పర్యటించారు. రోడ్‌షోలు నిర్వహించారు. గురువారం యాదగిరిగుట్టలో కేటీఆర్‌ రోడ్‌షోను నిర్వహించనున్నారు. సీపీఎం అభ్యర్థి బరిలో ఉండటంతో పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పార్టీ రాష్ట్రకార్యవర్గసభ్యులంతా కూడా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు.

భువనగిరిలో శ్రమిస్తున్న అభ్యర్థులు

భువనగిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లేష్‌, సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో అనూహ్య రీతిలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందేందుకు శాయశక్తులా ఒడ్డుతున్నారు. పలు పార్టీల్లో అసంతృప్తులు ఉండటంతో తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. వారిని అధిష్ఠానం పెద్దలతో బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలను కలుస్తూ, ప్రజల మద్దతుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. దీంతోపాటు నియోజకవర్గంలో తనతో కలిసొచ్చే నాయకులందర్నీ కలుసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి అన్ని నియోజకవర్గాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని చేపడుతున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:09 AM