Share News

కేంద్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ABN , Publish Date - May 08 , 2024 | 12:08 AM

కేంద్రంలో రానున్నది రాహుల్‌గాంధీ నా యకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం నిడమనూరులో నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కేంద్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

నిడమనూరు, మే 7: కేంద్రంలో రానున్నది రాహుల్‌గాంధీ నా యకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం నిడమనూరులో నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. మా యమాటలతో పదేళ్లు పాలించిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని ఆరోపించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ దేశానికి ప్రమాదకారిగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో బీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పిన మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నిక ల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభు త్వం కృషి చేస్తోందన్నారు. రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడు తూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం 92శాతం మంది రైతులకు రైతుబంధు సొ మ్ము జమ చేసిందన్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో సాగర్‌ నియోజకవర్గం నుంచి రఘువీర్‌రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని కోరారు. ముకుందాపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు వంగాల వెంకన్న, రాంసైదయ్య తదితరులు గండికోట యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రె్‌సలో చేరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, రంగశాయిరెడ్డి, మేరెడ్డి వెంకట్‌రాహుల్‌, నందికొండ మట్టారెడ్డి, మేరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, అంకతి సత్యం, పసుపులేటి సైదయ్య, అంకతి వెంకటరమణ, కొండా శ్రీనివా్‌సరెడ్డి, గండికోట యాదగిరి, చినవీరయ్య, బొల్లం శ్రీను, నూకల వెంకట్‌రెడ్డి, వల్లభ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అత్యధిక మెజార్టీతో చరిత్రను తిరగరాయాలి

త్రిపురారం: నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీని అత్యధిక మెజార్టీతో గె లిపించి దేశ పార్లమెంట్‌ చరిత్రను తిరగరాయాలని అభ్యర్థి కుం దూరు రఘువీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. త్రి పురారం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో వారు మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్‌ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఎత్తిపోతల పథకాలకు త్వరలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మా ట్లాడుతూ, ఓటర్లు హస్తం గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మార్కెట్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి బీఆర్‌ఎ్‌సను వీడి రఘువీర్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. తొలుత మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మ, జడ్పీటీసీ భారతి, పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు అనుముల శ్రీనివా్‌సరెడ్డి, భాస్కర్‌నాయక్‌, నరేష్‌, అనుముల వెంకట్‌రెడ్డి, గట్టు యాదగిరి, గోపగాని శ్రీనివాస్‌, పీబీ.శ్రీనివాస్‌, సాంబయ్య పాల్గొన్నారు.

కాంగ్రె్‌సది ప్రజాప్రభుత్వం

ప్రతీ గ్యారెంటీ అమలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మునుగోడు, చౌటుప్పల్‌, మే 7: కాంగ్రె్‌సది ప్రజాప్రభుత్వమని, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ గ్యారెంటీ అమలు చేసి ప్రజలు మెచ్చిన పాలన సాగిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మునుగోడు, చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలు, విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రైతులు ఎలాంటి అపవాదులను నమ్మవద్దని, రైతుబంధు డబ్బును రైతు భరోసా పథకం పేరుతో విడతల వారీగా అందజేస్తామన్నారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ నిలబడిందని, రాష్ట్ర ప్రజలను బీఆర్‌ఎస్‌ మోసం చేసిందని, ఈ రెండు పార్టీలకు ఓట్లు వేసిన వృథా అవుతాయని అన్నారు. ఈ పార్టీలను పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్‌నేత, అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌, డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు నారబోయిన రవిముదిరాజ్‌, జక్కలి ఐలయ్యయాదవ్‌, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, గుత్తా ఉమాదేవి, మర్రిగూడ, నాంపల్లి జడ్పీటీసీలు పాశం సురేందర్‌రెడ్డి, ఏవీ.రెడ్డి,బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, చౌటుప్పల్‌ ము నిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:08 AM