కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - May 09 , 2024 | 12:27 AM
ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న వ్యక్తి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు
బొమ్మలరామారం, మే 2: ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న వ్యక్తి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సోమ్‌నాథ్ కండ్ (28) అనే వ్యక్తి మండలంలోని లక్ష్మీతండాలోని ఇటుక బట్టీల వద్ద కొంత కాలంగా పనిచేస్తున్నాడు. కుటుంబ సమస్యలతో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా బుధవారం భార్య జానకి కండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ తెలిపారు.