Share News

ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:00 AM

సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన కే శ్రీనివా్‌సరెడ్డి సూచించారు.

ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివా్‌సరె డ్డి

రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన కే శ్రీనివాస్‌ రెడ్డి

చౌటుప్పల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన కే శ్రీనివా్‌సరెడ్డి సూచించారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని ఎస్‌ఎంఆర్‌ ఫంక్షన హాల్‌లో టీయూడబ్ల్యూజే చౌటుప్పల్‌ శాఖ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం గతంలో మీడియా పోషించిన పాత్రకు, ప్రస్తు తం పోషిస్తున్న పాత్రకు ఎంతో తేడా ఉందన్నారు. వ్యాపార కోణంలో మీడియాను కొనసాగిస్తే ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా సమాజానికి మేలు చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. భావ వ్యక్తీకరణకు సోషల్‌మీడియా పురుడు పోసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ ఆ స్వేచ్ఛను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సహించరానిదన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహతఅలీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు ల గొంతుకగా పనిచేస్తున్న ఏకైక సంఘం తమదేనన్నారు. మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు చౌటుప్పల్‌లో ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటు, ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సహకారంతో కృషి చేస్తానన్నారు. సమావేశంలో యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం బ నర్సింహ, పోతంశెట్టి కరుణాకర్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జర్నలిస్టు ల ఆరోగ్య కమిటీ సభ్యులు జహంగీర్‌, జాతీ య కౌన్సిల్‌ సభ్యులు ఇంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరి రాంరెడ్డి, జర్నలిస్టులు మహేందర్‌రెడ్డి, పందుల నర్సింహ, చిదుగుళ్ళ జంగయ్య, రాములు, లింగస్వామి పాల్గొన్నారు.

మానవ సంబంధాలను కాపాడుకోవాలి

చౌటుప్పల్‌ రూరల్‌ : మానవ సంబంధాలను కాపాడుకోవాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరులో శ్రీ సాయి వృద్ధాశ్రమంలో జర్నలిస్టులకు, వృద్ధులకు వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ప్రమాదబీమా పత్రాలను అందజేశారు. యాదాద్రి సేవా సంస్థ చైర్మన అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు శశి, కోశాధికారి విద్యాసాగర్‌రెడ్డి, నారాయణ, అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:00 AM